Site icon NTV Telugu

Grandmother Delivery: తల్లి అయిన నాయనమ్మ.. కొడుకు బిడ్డకు జన్మ.. ఎలాగంటే..!

Grandmother Delivery

Grandmother Delivery

Grandmother Delivery: తల్లి అయిన నాయనమ్మ అంటే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే సరోగసీ పుణ్యమా అని ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన సంఘటన అమెరికాలోని ఉతాహ్‌ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని అమెరికా మీడియా వెల్లడించింది. ఒక తల్లి సరోగేట్‌గా మారి అమెరికాలోని ఉతాహ్‌లోని తన కొడుకు బిడ్డకు జన్మనిచ్చింది. జెఫ్ హాక్ అనే వ్యక్తి తన భార్య గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చిన తర్వాత పలు ఎంపికలను పరిశీలించారు. చివరకి సరోగసీని ఆశ్రయించాలనుకున్నారు. జెఫ్ హాక్ యొక్క 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ అతనికి సరోగేట్‌గా ముందుకు వచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది అందమైన క్షణంగా హాక్ వర్ణించారు.

Urinating On Train Track: ఆగలే మనోడికి.. మెట్రో రైల్వే ట్రాక్‌పైనే మూత్రం పోసేశాడు.. వీడియో వైరల్

నాన్సీ హాక్ దీనిపై మాట్లాడుతూ ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం” అని తెలిపింది. పాప అమ్మమ్మకు నివాళిగా ఆ చిన్నారికి ”హన్నా” అని పేరు పెట్టారు. ఉతాహ్‌ టెక్ యూనివర్శిటీలో పనిచేస్తున్న నాన్సీ, పరీక్ష లేకుండా కూడా తనకు ఆడపిల్లే పుడుతుందని నమ్మకంగా ముందే చెప్పడం గమనార్హం. ఆమె చెప్పినట్లుగానే ఆడపిల్ల పుట్టింది. జెఫ్‌ హాక్‌ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్‌ హాక్‌, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్‌ హాక్‌. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్‌ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్‌ వెల్లడించింది. దీనిపై డాక్టర్ రస్సెల్ ఫౌల్క్ మాట్లాడుతూ మహిళ తన మనవలకు జన్మనివ్వడం అసాధారణం అయినప్పటికీ, వయస్సు నిజంగా పరిమితం చేసే అంశం కాదు. ఇది వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించినదని పేర్కొన్నారు.

 

Exit mobile version