76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. పోలీస్, ఎన్‌సీసీ, స్కౌట్ కవాతు మధ్య ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వారితో పాటు.. మంత్రులు నారా లోకేష్, సవిత, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారక తిరుమల రావు పాల్గొన్నారు. అనంతరం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
Read Also: Vizag Fake IAS: నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్!
తెలంగాణలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం.. అమరవీరుల సైనిక స్మారక స్థూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జాతీయ జెండా ఎగురవేశారు. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగరేశారు. తెలంగాణ భవన్‌లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేతలు జాతీయ జెండా ఎగురవేశారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పథకావిష్కరణ గావించారు.
Read Also: Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా నేపథ్యంలో విమాన ఛార్జీల నియంత్రణపై డీజీసీఏ చర్యలు