NTV Telugu Site icon

Ravan Dahan: ఇదెక్కడి విడ్డూరం.. రావణుడి పది తలలు దగ్ధం కాలేదని గుమస్తాపై వేటు

Ravan Dahan

Ravan Dahan

Ravan Dahan: విజయదశమి సందర్భంగా రావణ దహనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. రావణ దహనం పేరిట నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరిలో జరిగిన రావణదహన కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలల కాలకపోవడమే. ఈ ఘటనను ధంతరి మున్సిపాలిటీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. కేవలం రావణుడి కిందిభాగం మాత్రమే బూడిదైపోయింది. దీనికంతటికీ కారణం ఓ క్లర్క్ అని గుర్తించి, అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. అతడి అలసత్వం కారణంగానే రావణుడి పది తలలు దహనం కాలేదని నిర్ధారించారు. రావణుడి బొమ్మ తయారీ ఖర్చు బిల్లులను కూడా నిలిపి వేశారు. దీంతో పాటు కొంత మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రావణుడి తలలు ఎందుకు కాలిపోలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు.

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసు.. శివలింగానికి కార్బన్‌ డేటింగ్‌పై తీర్పు వాయిదా

ఈ వింతఘటన చత్తీస్‌గఢ్‌లోని ధంతరిలోని రామ్‌లీలా మైదానంలో జరిగింది. ఈ వేడుకల్లో రావణ దహనాన్ని స్థానిక పౌరసంఘం పర్యవేక్షిస్తోంది. ధంతరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ బొమ్మను రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ విధుల నుంచి తొలగించింది. అంతే కాకుండా ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాజేష్ పద్మవర్ వెల్లడించారు.

Show comments