Site icon NTV Telugu

Tammineni Sitaram: పేదలందరికీ మెరుగైన వైద్యం అందాలి

Tammineni Sitaram 1

Tammineni Sitaram 1

పేదలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వంశధార కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆమదాలవలస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి పనులను పరిశీలన చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆమదాలవలస మూడు కిలోమీటర్ల దూరం జొన్నవలస గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఊరుకి దూరంగా ఈ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి ఉండటంతో రోగులు ఎవరు వెళ్ళకపోవటం ప్రాథమిక ఆసుపత్రి నిరుపయోగంగా ఉండడంతో జొన్న వలసలో ఉన్న ఆసుపత్రిని ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వంశధార డిపార్ట్మెంట్ కొత్తగా నిర్మించిన భవనాలలోకి తరలించారు.

Read Also: GoDaddy: షాక్ ఇచ్చిన గోడాడీ.. 8 శాతం ఉద్యోగుల తొలగింపు..

ఆ పాత భవనాన్ని జొన్నవలసలో ఉన్న ఆసుపత్రి వంశధార భవనాలలోకి కొనసాగించాలని ప్రభుత్వం నుండి అనుమతులు తెప్పించాం అని తెప్పిన స్పీకర్ తమ్మినేని తెలిపారు. ఆసుపత్రులు నాడు నేడు పనులు భాగంగా ఆమదాలవలస ఆసుపత్రి కి రెండు వందల కోట్లు మంజూరు చేసామన్నారు. అందులోని భాగంగా జొన్నవలసలో ఉన్న ప్రాథమిక ఆసుపత్రి మున్సిపాలిటీ పరిధిలోని వంశధార భవనాలలో నిర్వహిస్తామని అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. వంశధార పాత భవనాలు పరిశీలన చేశారు. అధికారులకు పలు సూచనలు చేసి ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: RBI: ఆర్బీఐని ఆపటం కష్టమేనంటున్న నిపుణులు. చివరికి అదే నిజమైంది

Exit mobile version