Site icon NTV Telugu

AP Medical Services Recruitment Board: ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు

Heath

Heath

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిల్లో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్తగా బోర్డు ఏర్పాటు చేసింది. 17 పోస్టులతో బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించనున్న వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఉంటారు. మెంబర్ గా వైద్య ఆరోగ్య శాఖ నుండి జేడీ(అడ్మిన్) స్థాయి అధికారి వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకంలో తలమునకలవుతున్న రాష్ట్ర, జోనల్ , జిల్లా స్థాయి అధికారులు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో వారికి రిలీఫ్ లభించనుంది.

Read Also: Transgender : పెళ్లిలో డబ్బులు ఇవ్వలేదు.. రెచ్చిపోయిన హిజ్రాలు

ఇకనుంచి వీరికి వెసులుబాటు కల్పిస్తూ ఎపి మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బోర్డు ఏర్పాటుతో ఆసుపత్రులపై మరింత దృష్టిని కేంద్రీకరించనున్న హెచ్వోడీ , జోనల్ , జిల్లా స్థాయి అధికారులు. ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే నియమించేలా ఇప్పటికే ఆదేశాలిచ్చిన సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకనుగుణంగా పనిచేయనున్న ఎపి మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఉద్యోగ నియామకాల్లో ఇక వేగం రానుందని అంటున్నారు అధికారులు. మొత్తం మీద వైద్యసేవల రంగంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

Read Also: Boora Narsaiah Goud: మోడీ కాదు.. ముందు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

Exit mobile version