Site icon NTV Telugu

Governor invited Chandrababu: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం.. రాజ్‌భవన్‌కు చంద్రబాబు

Governor

Governor

Governor invited Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం అయ్యారు.. అందులో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం విదితమే.. ఇక, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమైన కూటమి నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్‌కు అందజేశారు.. సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామని గవర్నర్‌ వ్యాఖ్యానించినట్టు ఎన్డీయే కూటమి నేతలు వెల్లడించిన విషయం విదితమే.. కాగా.. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. దీంతో.. రాజ్‌భవన్‌కు చేరుకున్నారు కాబోయే ముఖ్యమంత్రి.. ప్రభుత్వ ఏర్పాటు.. మంత్రుల కూర్పు విషయాన్ని గవర్నర్‌కు వివరించారు చంద్రబాబు నాయుడు.

Read Also: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ

ఇక, రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.. ఇప్పటికే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వీఐపీల తాకిడి మొదలైంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రేపు గన్నవరం ఐటీ పార్క్‌ దగ్గర.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. ఇక, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తుది దశకు చేరుకున్నాయి ఏర్పాట్లు.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు.. రేపు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు విజయవాడలో ఉండనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వీఐపీల తాకిడి నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు.. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్, డీజీపీతో నిన్నే సమీక్ష జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

Exit mobile version