NTV Telugu Site icon

Gulf Workers: గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

ts govt

ts govt

గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. ఈ క్రమంలో.. గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ కోసం అడ్వైజరి కమిటీ నియామకం కానుంది. అలాగే.. ప్రవాసి ప్రజావాణి ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు.. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. ప్రతీ ఏడాది.. ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించనుంది సర్కార్.

Show comments