Site icon NTV Telugu

AP Govt: మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు..

Bsf

Bsf

పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది.

READ MORE: Imanvi: నిజంగానే ప్రభాస్ హీరోయిన్ కి పాక్ తో లింక్ లేదా?

ప్రభుత్వం, విశాఖ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేస్తూ భారతీయ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తేదీ 27.04.2025 లోపు భారతదేశం విడిచి వెళ్ళిపోవాలని పాకిస్థాన్ జాతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. విదేశీయుల చట్టం – 1946, సెక్షన్ 3(1) ప్రకారం ఉన్న అధికారాల ఆధారంగా పాకిస్థానీ పౌరులకు పలు రకాల వీసా సేవలను తక్షణమే రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

READ MORE: CSK vs SRH: చపాక్ స్టేడియంలో మెరిసిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

వీటిలో పాకిస్థానీ పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసిన దీర్ఘ కాలిక వీసాలకు(Long term visas) సంబంధించి ఈ ఉత్తర్వులు చెల్లవు. అదే విధంగా దౌత్య(Diplomatic) & అధికారిక(Official) వీసాల తుది గడువును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. సార్క్(SAARC countries) వీసాల తుది గడువును తేదీ 26.04.2025 గా, వైద్యపరమైన(Medical) వీసాల తుది గడువును తేదీ 29.04.2025 గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలి. లేదంటే అక్రమంగా నివాసం ఉంటున్న వారితో పాటు వారికి ఆశ్రయం కల్పించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.

READ MORE: CSK vs SRH: చపాక్ స్టేడియంలో మెరిసిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే?

27 ఏప్రిల్ 2025 తేదీ నుంచి తక్షణమే రద్దు పరచిన వీసాల వివరాలు :-
* తక్షణ వీసాలు(Visa on arrival)
* వ్యాపారం(Bussiness)
* సినిమా(Film)
* జర్నలిజం(Journalist)
* రవాణా(Transit)
* సమావేశాలు (conference)
* పర్వతారోహణ (Mounteneering)
* విద్యార్థి(student)
* సందర్శన(Visitors)
* బృంద పర్యటనలు(Group tourist)
* యాత్రిక(pilgrims)
* పాకిస్తాన్ దేశీ యాత్రిక బృంద వీసాలు(Group Pilgrim visa to minorities of Pakistan)

Exit mobile version