Site icon NTV Telugu

Teacher: జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రభుత్వ టీచర్లు..

Teachers

Teachers

ఇటీవల పలువురి ఉపాధ్యాయుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. వారి ప్రవర్తనతో ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన వారు వక్రమార్గాన్ని అనుసరిస్తున్నారు. దేవాలయాలుగా భావించే పాఠశాలలు, కళాశాలల్లో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు క్షణికావేశంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు విద్యార్థుల ముందే తన్నుకుంటున్నారు. ఇదే రీతిలో ప్రభుత్వ టీచర్లు జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Also Read:Samantha : సమంతకు స్టేజ్ పైనే ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో..

మధ్యప్రదేశ్ – ఖర్గోన్ లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో జుట్లు పట్టుకుని ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ దహియా, లైబ్రేరియన్ మధురాణి. ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా వర్క్ విషయంలో విభేదాలు రావడంతో గొడవ పడ్డారని సమాచారం. మాటా మాటా పెరగడంతో విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించి, తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు కమిషనర్. సమాజంలో ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవం ఇలాంటి చేష్టల వల్ల దిగజారుతోందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version