Religious Propaganda : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మత ప్రచారం చేస్తూ పట్టుబడ్డాడు. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బైబిల్లు పంచిపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ నాయకులు సదరు ప్రభుత్వ ఉద్యోగి బండారాన్ని బయటపెట్టారు. ఈ మేరకు బీజేపీ నేతలు సదరు ఉపాధ్యాయుడిపై ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు.. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు బైబిల్లను పంపిణీ చేశాడు. విద్యార్థిని, విద్యార్థులకు బైబిళ్లు పంచారు అన్న సమాచారం అందుకున్న స్థానిక బిజెపి పార్టీ నాయకులు.. బైబిల్ల ను విద్యార్థుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయ గదిలో ఉన్న మరో బైబిల్ల ప్యాకింగ్ ను స్వాధీనం చేసుకొని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగాల రాజుపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు కోరారు.
Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా స్మృతి