Site icon NTV Telugu

Pharma Companies: ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసిన ప్రభుత్వం.. 105 ఫార్మా కంపెనీలపై కొరడా

Medicines

Medicines

Pharma Companies: నాణ్యమైన మందుల కోసం ప్రభుత్వం మందుల తయారీ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్యతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫార్మా కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తూ తీసుకున్న చర్యలను తెలియజేశారు. ఫార్మా ఉత్పత్తుల నాణ్యతను కొనసాగించేందుకు రెగ్యులేటరీ అథారిటీ ప్లాంట్ల తనిఖీ, ఆడిట్‌ను ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. అలాగే 137 ఫార్మా కంపెనీలను తనిఖీ చేసి 105 కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో 31 కంపెనీలు మూతపడగా, 50 కంపెనీల లైసెన్సుల రద్దు ప్రక్రియ ప్రారంభమైంది.

Read Also:Rashi Khanna Saree Pics: పట్టు చీరలో రాశి ఖన్నా.. అందానికే అసూయ కలిగేలా మెరిసిపోతుంది!

ఓ నివేదిక ప్రకారం ప్రభుత్వం 73 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 21 సంస్థలపై హెచ్చరిక లేఖలు కూడా విడుదల చేసింది. నకిలీ మందులను తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)ని ఆరోగ్య మంత్రి ఆదేశించారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలను తనిఖీ చేయడానికి ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని, వారు మందుల నాణ్యతను తనిఖీ చేస్తారని ఆరోగ్య మంత్రి తెలిపారు.

Read Also:World Record: గిన్నిస్‌ రికార్డు పుట్టిన రోజు.. ఒకే రోజున 9 మంది పుట్టిన రోజు

Exit mobile version