కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట వరంగా మారుతుంది.. వరుసగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చెయ్యనున్నారు.. పూర్తి వివరాలు..
ఒక్కో పోస్టుకు ఒక్కో విధమైన అర్హతలు ఉన్నాయి.. ఇకపోతే ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ కు 35,400 నుండి 112400, టెక్నీషియన్ కు 19,900 నుండి 63200రూ, ల్యాబొరేటర్ అటెండెంట్ కు 18000 నుంచి 56,900రూ వేతనంగా చెల్లిస్తారు.. దరఖాస్తు ప్రక్రియ జులై 24, 2023 నుండి ప్రారంభం అయింది. దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఆగస్టు 14, 2023గా నిర్ణయించారు.. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో వయోపరిమితి ఉంది.. ఈ ఉద్యోగాల అర్హతల విషయానికొస్తే.. పది పాస్ అయ్యి 50 శాతం ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులు వచ్చి ఉండాలి..టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 12వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత మరియు మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో 1 సంవత్సరం డిప్లొమా ఉండాలి.. అలాగే టెక్నీషియన్ పోస్టులకు ఫస్ట్ క్లాస్ లో మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీతో సైన్స్ / ఫుడ్ కెమిస్ట్రీ / ఫుడ్ టెక్నాలజీ / ఫుడ్ అండ్ న్యూట్రిషన్ / హోమ్ సైన్స్ లో పాస్ అయ్యి ఉండాలి..
