Site icon NTV Telugu

Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక.. వెంటనే ఈ పని చేయండి!

Chrome

Chrome

ఏదైనా తెలియని సమాచారం తెలుసుకోవాలనుకుంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే వెంటనే ఈ పని చేయాలని అలర్ట్ చేసింది. ప్రభుత్వ సంస్థ CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. టెక్ దిగ్గజం వెబ్ బ్రౌజర్‌లో ఉన్న కొన్ని లోపాల గురించి తెలియజేసింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్ నుంచి ముఖ్యమైన డేటాను చోరీ చేసే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:Illicit relations: మామతో పరారైన భార్య.. రూ. 20 వేల రివార్డు ప్రకటించిన భర్త

గూగుల్ బ్రౌజర్ క్రోమ్ పాత వెర్షన్లలో కొన్ని లోపాలు గుర్తించామని, దీని కారణంగా హ్యాకర్లు వినియోగదారుల కంప్యూటర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని CERT-In తెలిపింది. మీరు Windowsలో Chrome ఉపయోగిస్తుంటే, ఈ బగ్‌లు 136.0.7103.114 కి ముందు వెర్షన్‌లలో ఉన్నాయి. మీరు Mac లేదా Linux వినియోగదారు అయితే, ఈ బగ్ 136.0.7103.113 కి ముందు వెర్షన్లలో ఉంది. గూగుల్ క్రోమ్ పాత వెర్షన్లలో రెండు బగ్‌లు ఉన్నాయని CERT-In నివేదించింది.

Also Read:Illicit relations: మామతో పరారైన భార్య.. రూ. 20 వేల రివార్డు ప్రకటించిన భర్త

CVE-2025-4664: Chrome లోని ఈ బగ్ బ్రౌజర్ లోడర్ విధానాన్ని సరిగ్గా వర్తింపజేయదు. దీనితో హ్యాకర్ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా మీ కంప్యూటర్ నుంచి డేటాను దొంగిలించవచ్చు.

CVE-2025-4609: ఈ బగ్ క్రోమ్ మోజో కాంపోనెంట్‌లో ఉంది. ఇది హ్యాండ్లింగ్ సమస్యను సృష్టిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని, హ్యాకర్లు మీ సిస్టమ్‌లోకి చొరబడవచ్చు.

Also Read:Balochistan: బలూచిస్తాన్‌లో బలవంతంగా అదృశ్యం అవుతున్న బలూచ్‌లు.. పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు

రక్షణ కోసం ఏమి చేయాలి?

ఈ బగ్‌లను నివారించడానికి, వినియోగదారులు తమ సిస్టమ్‌లో తాజా Chrome బ్రౌజర్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని CERT-In Chrome వినియోగదారులకు స్పష్టంగా తెలిపింది. దీని కోసం వారు Chrome ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అప్ డేట్ చేసేందుకు కంప్యూటర్‌లో Chrome బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత కుడి వైపున ఉన్న మూడు చుక్కలు (మెనూ) పై క్లిక్ చేయండి. ఇప్పుడు హెల్ప్ లో About Google Chrome పై క్లిక్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది.

Exit mobile version