Site icon NTV Telugu

Youth For Anti-Corruption: ప్రభుత్వ ఉద్యోగులు ఐడీ కార్డులు ధరించాలి..

Youth For Anti Corruption

Youth For Anti Corruption

Youth For Anti-Corruption: యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం ఎర్రమంజిల్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారులు శ్రీనివాస్ మాధవ్, సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి పాల్గొన్నారు. ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఐడీ కార్డు ధరించాలని, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నుంచి డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, భారత కేబినెట్ సెక్రటరీ, జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ గుర్తింపు కార్డును ప్రజలకు కనబడేలా ధరించాలని దేశంలోని అనేక హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఈ లేఖతో జతపరిచింది.

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఐడీ కార్డులను విధిగా ధరించడం లేదని, సాధారణ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. ఐడీ కార్డులు ధరించకపోవడం ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఒక సామాన్యుడు ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అందులో ఎవరు ఏ అధికారినో తెలియడం లేదన్నారు. ప్రభుత్వోద్యోగులందరూ విధి నిర్వహణలో ఐడీ కార్డులు ధరించేలా మార్గదర్శకాలను పాటించేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో కోరారు. ఈ మార్గదర్శకాలు అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. సాధారణ ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు.

పబ్లిక్ సర్వెంట్ల సరైన గుర్తింపు సమస్య చాలా ముఖ్యమైన విషయమన్నారు. ఈ లేఖపై సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వర్తించే కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ప్రభుత్వ అధికారి తమ బాధ్యతగా ఐడీ కార్డు ప్రజలకు కనబడేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తరపున కోరారు.

Samantha: ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసిన సినీ నటి సమంత

శ్రీనివాస్ మాధవ్ మాట్లాడుతూ.. సమాజంలో మార్పుకోసం మరికొన్ని అంశాలపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ముందుకు పోవాలన్నారు. యువతకు, మహిళలకు రెస్పెక్ట్ పెరిగేలా సంస్థ కృషిచేయాలన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ప్రభుత్వం ఇచ్చిన ఐడీ కార్డును వినియోగించుకోవడం వారి బాధ్యత అన్నారు. చిన్న ఉద్యమమైనా పెద్ద మార్పుకు దోహదం చేస్తుందన్నారు.

ఒక మనిషి అత్యవసర ఆనారోగ్య పరిస్థితికి గురైనప్పుడు ఎలా స్పందించాలో అనే పలు అంశాలపై డాక్టర్ ప్రతిభాలక్ష్మి ప్రాణదాత కార్యక్రమం ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా ఒక వ్యక్తి గుండెపోటుకు గురైతే అతనిని సీపీఆర్ చేసి ఎలా కాపాడాలనే అంశంపై సంస్థ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఇది మరింత ఎక్కువమందికి వ్యాపించి ఒక్కరికి హెల్ప్ జరిగినా చాలు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డా. ప్రతిభాలక్ష్మి అన్నారు. ముఖ్యంగా యువత దీనిపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కార్యదర్శి జయరాం, సంస్థ సభ్యులు గంగాధర్, దేవేందర్, కానుగంటి రాజు, చెరుకూరి జంగయ్య, మణిదీప్, శ్రీనివాస్ రావు, హరి, మారియా ఆంటోనీ, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, స్నిగ్థ, కొల్లె భవాని, ప్రగతి, శిరీష, ప్రగతి, అశ్విని, నాగేంద్ర, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version