Site icon NTV Telugu

Viral : తాటి చెట్టు ఎక్కి ఇరుక్కుపోయిన గౌడన్న..

Palm Tree

Palm Tree

జీవనోపాధిలో భాగంగా రోజు లాగానే ఇంటి నుండి బయలుదేరిన గౌడన్న ఊరికి సమీపంలోని తన తాటి చెట్టు పైకి చక చకా ఎక్కాడు. అక్కడ కాస్తా కాలుకున్న మోకు అదుపుతప్పడంతో భయంతో అక్కడే ఉండిపోయాడు. ప్రాణాలు అరచేత పెట్టుకొని ఉన్న అతడిని కింద ఉన్న గౌడన్నలు గమనించి చకచకా ఎక్కి చాకచక్యంగా అతన్ని కిందికి తీసుకువచ్చారు. అన్ని చెబుతున్న గాని అసలు విషయం మర్చిపోయాను అనుకునేరు… ఇదంతా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో జరిగింది. సుందిళ్ల గ్రామంలోని గర్రెపల్లి రవి గౌడ్ నిత్యం తన తాటి చెట్లకు సంబంధించిన కల్లును తీసి విక్రయిస్తూ జీవనోపాధి పొందేవాడు. అదే మాదిరిగా ఈరోజు తాటి చెట్టు వద్దకు వచ్చి మోకు కట్టుకుని, కుండా వేసుకొని చకచగా చెట్టు పైకి ఎక్కాడు. ఆ చివరి వరకు వెళ్లడంతో మోకు జారి అక్కడే ఉండిపోయాడు. భయంతో అరవడంతో కింద ఉన్న తోటి గౌడ్స్ శోభన్, నారాయణ గమనించి వెంటనే పైకి వెళ్లారు. చాకచక్యంగా రవి గౌడ్ ను మెల్ల మెల్లగా కిందికి దించారు. దీంతో ప్రాణభయంతో విలవిలలాడిన రవి గౌడ్ కిందికి రావడంతో ఊపిరిపించుకున్నాడు. అప్పటిదాకా కింద ఉన్నవాళ్లు కూడా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. రవి గౌడ్ కిందికి రావడంతో అందరూ రిలాక్స్ అయ్యారు.

 

Exit mobile version