NTV Telugu Site icon

‘పుష్ప’ మాస్ ట్రీట్… ఇంటర్వెల్‌కు ముందే సమంత ఐటమ్ సాంగ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. అయితే ‘పుష్ప’లో మాత్రం ఇంటర్వెల్‌కు ముందే సమంత ‘ఊ అంటావా మావా..’ అంటూ తన ఐటమ్ సాంగ్‌తో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అని.. ఇందులో బన్నీ, సమంత స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగిస్తాయని మేకర్స్ చెప్తున్నారు.

Read Also: దేనికైనా సై అంటున్న ఆది పినిశెట్టి!

సెకండ్ హాఫ్‌లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో డైరెక్టర్ సుకుమార్ ఈ పాటను ఫస్ట్ హాఫ్‌లోనే ప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. సెకండ్ హాఫ్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించాడట. సినిమాకు ఇదే హైలైట్ కానుందని టాక్ నడుస్తోంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో బైక్ చేజ్ ఎపిసోడ్ అని సమాచారం. అంతేకాకుండా ఈ మూవీలో అనసూయ, సునీల్ మేకోవర్ ప్రేక్షకులను షాక్ చేస్తుందని.. ఐపీఎస్ అధికారిగా ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడని ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే రీతిలో కిక్ ఇస్తాయని టాక్.