Site icon NTV Telugu

UP: ఛీ.. ఛీ.. రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. ప్రేమ జంట వికృత చేష్టలు..(వీడియో)

Up

Up

UP: యువత ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్ జిల్లాలోని రామ్‌గర్తల్ ప్రాంతంలో ఇలాగే ఓ జంట బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కారు. ఇక్కడ ఓ యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తునన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అందులో ఇద్దరూ అశ్లీల భంగిమలో కూర్చున్నారు. తాము రోడ్డు మీద ఉన్నామన్న సోయి కూడా లేకుండా ప్రవర్తించారు. ఈ సంఘటనను ఒక బాటసారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను యూపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గోరఖ్‌పూర్ పోలీసులను ఈ విషయంలో వెంటనే చర్య తీసుకోవాలని కోరారు.

READ MORE: Cyber Crime : 500 కోట్ల సైబర్ మోసాల వెనుక విజయవాడ యువకుడు.. శ్రవణ్ కుమార్ అరెస్ట్

యూపీ పోలీసులు సైతం స్పందించారు. ఈ వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “రోమియో, జూలియట్ బైక్ సీక్వెల్” అని అభివర్ణించారు. “ఈసారి క్లైమాక్స్‌లో ప్రేమ పాటకు బదులుగా భారీ జరిమానా ఉంటుంది. సురక్షితంగా డ్రైవ్ చేయండి, నియమాలను పాటించండి, తద్వారా మీ ప్రేమకథ ఎక్కువ కాలం కొనసాగుతుంది” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. మరోవైపు.. గోరఖ్‌పూర్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో కనిపిస్తున్న బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా ప్రేమ జంటను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించే, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

READ MORE: Billionaire Bunkers: బిలియనీర్లకు ప్రాణభయం.. రిసార్ట్‌లను తలదన్నేలా బంకర్ల నిర్మాణం..

Exit mobile version