Site icon NTV Telugu

Bhimaa : భీమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!

Whatsapp Image 2024 01 11 At 5.47.50 Pm

Whatsapp Image 2024 01 11 At 5.47.50 Pm

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో గత పదేళ్లుగా లౌక్యం, సీటీమార్ మినహా అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.రీసెంట్ గా గోపీచంద్ నటించిన రామబాణం మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ భీమా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ షూటింగ్ పూర్తికాకుండానే అమ్ముడుపోయాయి. భీమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా…శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నది. ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు కలిపి ఇరవై కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ గత సినిమాలు చాలా వరకు డిజాస్టర్స్‌గా నిలిచినా ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోవడం హాట్‌టాపిక్‌గా మారింది.భీమా సినిమాతో కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కంప్లీట్‌గా నెగెటివ్ షేడ్స్‌తో గోపీచంద్ పాత్ర సాగుతుందని సమాచారం.

గత సినిమాలకు పూర్తి భిన్నంగా మరింత పవర్‌ఫుల్‌గా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.జనవరి 5న భీమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎద్దుపై కూర్చొని వైల్డ్ లుక్‌లో గోపీచంద్ కనిపించాడు. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు వచ్చాడ్రా అంటూ టీజర్‌లో వినిపించిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. భీమా సినిమాలో గోపీచంద్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ మరియు మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కేజీఎఫ్‌, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రవి బస్రూర్ బీజీఎమ్ భీమా మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.భీమా మూవీ 2024 ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని సమాచారం. ప్రస్తుతం భీమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.. జనవరి నెలాఖరులోగా పాటలతో పాటు టాకీపార్ట్ మొత్తం పూర్తికానున్నట్లు సమాచారం

Exit mobile version