NTV Telugu Site icon

Viswam Twitter Review: గోపీచంద్ ‘విశ్వం’ ట్విటర్‌ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?

Viswam Movie

Viswam Movie

Viswam Movie Twitter Review: మ్యాచో స్టార్ గోపీచంద్‌ కథానాయకుడిగా.. ఫామిలీ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్య థాపర్‌ కథానాయిక. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. 2024 దసరా కానుకగా నేడు (అక్టోబర్‌ 11) విశ్వం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Also Read: IPL 2025-Rohit Sharma: రోహిత్ వేలంలోకి వస్తే.. ఆక్షన్ ఆసక్తికరమే!

విశ్వం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఎంటర్‌టైనర్ స్టోరీ అయినా.. సినిమా బాగుందని అంటున్నారు. గోపీచంద్ నటన, కామెడీ సీన్స్ బాగున్నాయట. కామెడీ పరంగా సినిమా బాగానే ఉందంటున్నారు. గోపీచంద్‌ మార్క్‌ యాక్షన్‌, శ్రీనువైట్ల స్టైల్‌ కామెడీ సినిమాలో ఉందట. ఇటీవలి కాలంలో కామెడీ సినిమాలు పెద్దగా రాలేదు కాబట్టి విశ్వం ఆడుతుందని చాలా మంది అంటున్నారు. ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్ ఫిల్మ్ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments