Google Verification Badges: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’లో జనాలు ఏ అంశం గురించి సెర్చ్ చేసినా.. కొన్నిసార్లు దాని తాలూకా నకిలీ ఖాతాలు దర్శనమిస్తుంటాయి. చాలా మంది నకిలీ ఖాతాలనే వినియోగిస్తుండడంతో.. హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. దాంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫేక్ వెబ్‌సైట్లకు చెక్ పెట్టేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే ఫలితాలకు ‘వెరిఫైడ్ బ్యాడ్జ్’ అందించేందుకు సిద్ధమైంది.
కంపెనీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం గూగుల్‌లోని వెబ్‌సైట్ల పక్కనే చెక్ మార్క్‌లను చూపించేలా పరీక్షలు నిర్వహిస్తున్నాం అని గూగుల్ అధికారులు తెలిపారు. గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఎపిక్ గేమ్స్, యాపిల్ కంపెనీల అధికారిక సైట్ లింక్ పక్కన బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తోందని ‘ధ వెర్జ్’ ధృవీకరించింది. అయితే టెస్టింగ్ దశలో కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందట. ప్రస్తుతానికి పరిమిత సంఖ్య ఖాతాలతో ఈ ఫీచర్‌ను గూగుల్ పరీక్షిస్తోంది.
Also Read: Mohammed Siraj: ఇంటర్వ్యూ మధ్యలోంచే పారిపోయిన సిరాజ్.. ఏం జరిగిందంటే?
వెరిఫైడ్ బ్యాడ్జ్‌లతో ప్రయోగాలు చేయడం గూగుల్‌కు ఇదే మొదటిసారి కాదు. మెసేజ్ ఐడెంటిఫికేషన్ కోసం బ్రాండ్ ఇండికేటర్స్‌పై రూపొందించబడిన ఇదే విధమైన ఫీచర్‌ను ‘జీమెయిల్’కు ఆపాదించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో అధికారుల ఖాతాను గుర్తించేందుకు వెరిఫైడ్ బ్యాడ్జ్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇకపై ఇకపై అలాంటి సదుపాయమే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లోనూ కనిపించనుంది.