Sensational Onehanded Catch on Mountain: సాధారణంగా క్రికెట్ గ్రౌండ్‌లో ప్లేయర్స్ డైవ్‌లు చేసి అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. బౌండరీ లైన్ వద్ద ఊహించని రీతిలో క్యాచ్‌లు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతూ రన్నింగ్ క్యాచ్ పట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ పాకిస్తాన్ కుర్రాడు కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య పరుగెడుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకుసంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘బెస్ట్ క్యాచ్’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
వీడియో ప్రకారం… కొంతమంది అబ్బాయిలు కొండ ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్నారు. బౌలర్ బాల్ వేయగా.. బౌన్సర్‌గా వచ్చిన బంతిని బ్యాటర్ భారీ షాట్ ఆడాడు. బంతి చాలా ఎత్తులో లెగ్ సైడ్ ఉన్న కొండ వైపునకు వెళ్లింది. కీపింగ్ చేస్తున్న ఓ యువకుడు పెరుగెత్తుకుంటూ వెళ్లాడు. రాళ్లు, రప్పలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఆపై చిన్న గుంతలోకి దూకినా బ్యాలెన్స్ చేసుకున్నాడు. అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకున్న ఆ కుర్రాడిని సహచరులు అభినందించారు.
Also Read: Cricket Viral Video: దురదృష్టం వెక్కిరిస్తే ఇలానే ఉంటుంది మరి.. క్రికెట్ హిస్టరీలో అన్‌లక్కీ ఔట్!
యువకుడు పట్టిన క్యాచ్‌కు సంబందించిన వీడియోను కరాచీకి చెందిన ఫైజన్ లఖానీ అనే స్పోర్ట్స్ జర్నలిస్ట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘వాట్ ఎ క్యాచ్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. 14 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. ‘క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్‌గా కొందరు అభివర్ణిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌తో మరికొందరు పోల్చుతున్నారు.
What a catch! #cricketonmountain pic.twitter.com/nOkGv1H480
— Faizan Lakhani (@faizanlakhani) July 16, 2024