Trump Google Search Controversy: నిత్యం తన నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నిజంగా ఇది అవమానమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది అమెరికాకు కూడా అవమానమే. అసలు ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. కొంతకాలం క్రితం గూగుల్‌లో “ఇడియట్” అని టైప్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు కనిపించాయి. ఇది రాజకీయ చర్చకు దారితీసింది. గూగుల్ ఉద్దేశపూర్వక పక్షపాతంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి గూగుల్ స్పందించింది.. ఇందులో ఏ ఉద్యోగి మాన్యువల్ తారుమారు ఫలితంగా లేదని, అల్గోరిథంలు, వినియోగదారు కార్యకలాపాలకు సంబంధించిన ఆటోమేటిక్ ఫలితం అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వివరణ ఇచ్చారు.
READ ALSO: TVK Vijay: అల్లు అర్జున్ మాదిరి.. హీరో విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?
అల్గోరిథం ఎలా పనిచేస్తుందో తెలుసా..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకారం.. గూగుల్ సెర్చ్ ఇంజిన్ తాజాదనం, మొదలైన 200 కంటే ఎక్కువ అంశాల ఆధారంగా కంటెంట్‌ను ర్యాంక్ చేస్తుంది. ఇక్కడ సిబ్బంది మాన్యువల్ జోక్యం ఉండదు. పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఒక పదాన్ని ఒక చిత్రం లేదా పేజీతో పదే పదే అనుబంధించినప్పుడు, అల్గోరిథం ఆ నమూనాను ఎంచుకుని ఫలితాల్లో ప్రదర్శిస్తుంది. అందుకే “ఇడియట్” అనే పదం ట్రంప్ చిత్రాలతో ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం వివాదానికి “గూగుల్ బాంబింగ్” అనే ట్రెండ్ ఆజ్యం పోసిందని అంటున్నారు. రెడ్డిట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలోని వ్యక్తులు ట్రంప్ చిత్రాలను “ఇడియట్” అనే పదానికి లింక్ చేశారు. ఈ కనెక్షన్ ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. దీనిని గూగుల్ అల్గోరిథంలు అత్యంత సందర్భోచితంగా భావించడంతో అమెరికా అధ్యక్షుడి ఫోటో ఇడియట్ అని టైప్ చేస్తే వచ్చిందన్నారు.
గూగుల్‌పై ట్రంప్ ఆరోపణలు..
ఈ సంఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ Google రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. కానీ దర్యాప్తులో అధ్యక్షుడి ఆరోపణలకు బలం చేకూర్చే లాంటి ఆధారాలు లభించలేదు. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ.. Google వినియోగదారు కార్యకలాపాలను మాత్రమే ట్రాక్ చేస్తుందని, రాజకీయ ఎజెండాను అనుసరించదని స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌లో ప్రజలందరూ ఏం సర్చ్ చేస్తున్నారు అనేది ఎలా ప్రభావితం చేస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుందని చెప్పారు. దీని అర్థం డిజిటల్ ప్రపంచంలో వినియోగదారు చర్యలు సమాచారాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు.
