RBI Approved Loan Apps: రూ.లక్షల్లో లోన్.. 2 నిమిషాల్లోనే.. ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాపులర్‌లోన్ యాప్స్ ఎంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Approved Loan Apps: అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం అయితే మీరు ఏం చేస్తారు. ఈ ఆధునిక కాలంలో అందరికీ మొదట గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్. కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అన్ని బ్యాంకులు ఈజీ ప్రాసెస్‌తో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. మీకు తెలుసా వీటికి అడ్వాన్స్‌డ్ వెర్షన్స్‌గా లోన్ యాప్స్ కూడా వచ్చి పాపులర్ అయ్యాయని. ఇక్కడ మీరో విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి. అది ఏంటంటే వీటిలో కొన్నింటికి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం ఉంది. ఇంతకీ ఆర్బీఐ ఆమోదం పొందిన ఈ లోన్ యాప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Rajahmundry: పుష్కర్ ఘాట్‌లో స్థానానికి వెళ్లి ఇద్దరు భవానీలు గల్లంతు..
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
ఆర్బీఐ అనుమతి పొందిన 10 పాపులర్ లోన్ యాప్స్ ..
ఫైబ్ (Fibe) – ఈ యాప్‌లో కేవలం 2 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. జీరో ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్ మ్యూచువల్ ఫండ్స్‌పై కూడా లోన్లు అందిస్తుంది.
జెస్ట్‌మనీ (ZestMoney) – ఈ లోన్ యాప్‌లో ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదు. ఇది రూ.2 లక్షల వరకు క్రెడిట్ ఫెసిలిటీ అందిస్తుంది. కస్టమర్ లోన్ అమౌంట్‌ను 3, 6, 9 లేదా 12 భాగాలలో తిరిగి చెల్లించవచ్చు.
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ – ఈ బ్యాంకు ఏడాదికి 9.99 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. రీపేమెంట్ టైం వచ్చేసి 9 నుంచి 60 నెలల వరకు ఉంటుంది.
ఆదిత్య బిర్లా క్యాపిటల్ – ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంవత్సరానికి 19.45 శాతం వడ్డీతో 12 నెలల వరకు టెన్యూర్‌తో ఇన్‌స్టంట్ లోన్లు అందిస్తోంది. 12 నెలల కంటే ఎక్కువ టెన్యూర్ అయితే, సంవత్సరానికి 20.45 శాతం వడ్డీ ఉంటుంది. అయితే కస్టమర్‌కు మినిమం క్రెడిట్ స్కోరు 650 ఉండాలి.
క్రెడిట్ బీ – క్రెడిట్ బీ రూ.6 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ ఆఫర్ చేస్తుంది. వడ్డీరేటు ఏడాదికి 12 నుంచి 28 శాతం మధ్యలో ఉంటుంది. ఈ మొత్తాన్ని 6 నెలల నుంచి 60 నెలల లోపు రీపేమెంట్ చేయవచ్చు.
CASHe – ఈ యాప్‌లో రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. టెన్యూర్ 9 నెలల నుంచి 18 నెలల వరకు ఉంటుంది.
mPokket – ఇది రూ.50 వేల వరకు క్రెడిట్ లిమిట్‌తో చిన్న రుణాలను అందిస్తుంది. KYC కోసం కస్టమర్లు పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు సమర్పించాలి. లోన్ మొత్తాన్ని ఒకేసారి లేదా EMIలలో తిరిగి చెల్లించవచ్చు.
మనీ వ్యూ- ఇది తక్కువ సమయంలో రూ.10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. టెన్యూర్ 3 నెలల నుంచి 60 నెలల వరకు ఉంటుంది.
స్టాష్‌ఫిన్ – స్టాష్‌ఫిన్ యాప్‌లో రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్‌తో లోన్ తీసుకోవచ్చు. 30 రోజుల ఇంట్రస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. అంటే నెల రోజులు వడ్డీ పడదు.
లేజీ పే – లేజీ పే ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ లేకుండా రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ అందిస్తుంది. అయితే కస్టమర్ KYC, బ్యాంక్ వివరాలను సమర్పించాలి, ఆటో-పే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి, లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. లోన్ రీపేమెంట్ పీరియడ్ 3 నుంచి 24 నెలల వరకు ఉంటుంది.
అత్యవసర సమయంలో లోన్ యాప్‌ల ద్వారా చాలా వేగంగా, ఈజీగా డబ్బు అప్పుగా తీసుకోవచ్చు. ఎవరికైతే డబ్బు అవసరం ఉంటుందో వాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వెంటనే, లెండర్స్ eKYC ప్రాసెస్ రిక్వెస్ట్ చేస్తారు. మీ క్రెడిట్ రిపోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పేస్లిప్స్ వెరిఫై చేసిన తర్వాత మీ రీపేమెంట్ కెపాసిటీని అంచనా వేస్తారు. ఆ తర్వాత లోన్ ఆమోదం పొందుతుంది. తర్వాత ప్రాసెసింగ్ ఛార్జీలు కట్ చేసి, మిగతా అమౌంట్‌ను మీ అకౌంట్‌కు క్రెడిట్ చేస్తారు. గుర్తింపు పొందిన ఫిన్‌టెక్ కంపెనీల లోన్ యాప్స్ నుంచి మాత్రమే డబ్బు అప్పుగా తీసుకోవాల ఆర్బీఐ, ప్రభుత్వాలు, ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. ఫేక్ యాప్స్, ఏజెంట్ల వలలో పడితే మోసపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Manchu Manoj: తేజ సజ్జాతో గొడవలపై స్పందించిన మనోజ్
తాజావార్తలు
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!