Site icon NTV Telugu

Google Pixel 8a Price: ‘గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ’పై 15 వేల తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ అదనం!

Google Pixel 8a Price

Google Pixel 8a Price

Rs 15000 Discount on Google Pixel 8a in Flipkart Freedom Sale: 2025 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఫ్రీడమ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 13 నుంచి 17 వరకు కొనసాగుతుంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలపై బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్, మోటరోలా, ఎంఐ, నథింగ్, వివో, గూగుల్‌ పిక్సెల్‌, ఒప్పో వంటి స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. ‘గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ’ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ఉంది. ఆ డీటేల్స్ ఓసారి చూద్దాం.

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ఫోన్‌ గత ఏడాది భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.52,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.37,999కి లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 28 శాతం తగ్గింపు లభిస్తోంది. అంటే మీరు రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ అదనంగా వర్తిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మరో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గనుంది. గూగుల్ పిక్సెల్ 8ఎపై 7 సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌డేట్‌లను అందిస్తోంది. గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫీచర్స్ తెలుసుకుందాం.

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ 120 హెడ్జ్ రీఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వచ్చింది. వెనకవైపు 64 ఎంపీ ప్రధాన లెన్స్‌తో పాటు 13 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌తో కెమెరాను ఇచ్చారు. సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 13 ఎంపీ కెమెరా ఉంటుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4404 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. వైఫై 6, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్‌ కూడా ఉంది.

Exit mobile version