NTV Telugu Site icon

Machine Learning Course: ఫ్రీ.. ఫ్రీ.. మెషిన్ లెర్నింగ్ కోర్సును ఉచితంగా నేర్పిస్తున్న గూగుల్

Google

Google

Machine Learning Course: ప్రపంచంలోనే అగ్రగణ్యమైన సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్. టెక్నాలజీ నేర్చుకోవాలనుకునే వాళ్ల కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది గూగుల్. “మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్స్ (MLCC)” అనే ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్‌కి అనుకూలంగా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ (ML) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ఒక ప్రధాన భాగం. దీని ద్వారా కంప్యూటర్లు ప్రోగ్రామింగ్ లేకుండా డేటా నుంచి నేర్చుకుంటాయి. ఈ టెక్నాలజీని ప్రస్తుతం అనేక రంగాలలో ఉపయోగిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ చెప్పడం, మెడికల్ డయాగ్నోసిస్‌లు, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులలో వీడియోలు ఇంకా సినిమాలు రికమెండ్ చేయడం వంటి అనేక అప్లికేషన్లలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Also Read: BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోన్న BSNL.. రూ.1515కే ఏడాదిపాటు!

ఈ కోర్సు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చదువుతున్న స్టూడెంట్స్‌కు ఈ కోర్సు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, ML గురించి మరింత జ్ఞానం పెంచుకోవాలనుకునే గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్ కూడా ఈ కోర్సులో చేరవచ్చు. AI ఫీల్డ్‌లో కరియర్‌ని అభివృద్ధి చేసుకోవాలనుకునే వారు, ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకునే వారు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో మీరు మెషిన్ లెర్నింగ్ యొక్క అన్ని ముఖ్యాంశాలను స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు. ఈ కోర్సు మొత్తం 3 ప్రధాన విభాగాలపై ఉంటుంది.

– మెషిన్ లెర్నింగ్ (ML) బేసిక్స్: సూపర్‌వైజ్డ్, అన్‌సూపర్‌వైజ్డ్, రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ లలో ఉంటుంది.

* డేటా ప్రీప్రాసెసింగ్ & ఫీచర్ ఇంజనీరింగ్: డేటాను ఎలా సిద్ధం చేయాలో, ఎలాంటి టెక్నిక్‌లు ఉపయోగించాలో.

* అల్గారిథమ్స్ & మోడల్ సెలక్షన్: డెసిషన్ ట్రీస్, న్యూరల్ నెట్‌వర్క్స్, డీప్ లెర్నింగ్.

* రియల్-వరల్డ్ అప్లికేషన్స్: ఇమేజ్ రికగ్నిషన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆటోమేషన్ వంటి వాటిలో ML ఎలా ఉపయోగపడుతుందో.

Also Read: Gummadi Sandhya Rani: 1/70 యాక్ట్ మార్చే ఎలాంటి ఆలోచన లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..

ఈ కోర్సులో మీరు ప్రాజెక్ట్స్ పూర్తి చేసి వాటిని మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. అలాగే, మీరు ఈ స్కిల్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులతో పంచుకోవచ్చు. గూగుల్ AI ఎక్స్‌పర్ట్స్, ఇంజనీర్స్ మీకు అత్యుత్తమమైన ఎడ్యుకేషన్ అందిస్తారు. ML రంగంలో ట్రెండింగ్ అయిన అన్ని టెక్నిక్స్ బోధిస్తారు. ఈ కోర్సును పూర్తి చేసి, గూగుల్ నుంచి సర్టిఫికేట్ పొందటం మీ కెరీర్‌కు పెద్ద ప్రోమోషన్ కావచ్చు. దీనితో, మీరు జాబ్ మార్కెట్‌లో మంచి అవకాశాలు పొందవచ్చు.

ఈ కోర్సులో చేరడం చాలా సులభం. ముందుగా గూగుల్ అఫీషియల్ వెబ్‌సైట్‌కు వెళ్లి, కోర్సు కోసం రిజిస్టర్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ చేయడం ద్వారా మీరు ఈ కోర్సులో చేరవచ్చు. సైన్ అప్ చేసిన తర్వాత, మీరు కోర్సు మెటీరియల్స్ (వీడియో లెక్చర్స్, అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్) సులభంగా చూడవచ్చు.