Site icon NTV Telugu

Google Map Effect: తప్పుదారి చూపించిన గూగుల్ మ్యాప్.. ప్రమాదంలో లారీ డ్రైవర్

Google Map

Google Map

గూగుల్ రోడ్ మ్యాప్ ఓ లారీని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి జలాశయం విషయంలో గూగుల్ మ్యాప్ తప్పుదారి చూపించి ప్రమాదంలో నెట్టివేసింది. గుడాటిపల్లి దగ్గర నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ లారీ చిక్కుకోవడానికి కారణమైంది. నిన్న (బుధవారం) తెల్లవా రుజామున రెండు గంటలకు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్ వెళ్తుంది. డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యకు దారిపై సరైన అవగాహన లేకపోవడంతో స్మార్ట్ ఫోన్ లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా లారీని నడిపారు.

Read Also: Husband’s gift to wife: చంద్రుడిపై ఎకరం భూమి.. భార్యకు భర్త పుట్టినరోజు కానుక..

అయితే, నందారం స్టేజి దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ మ్యాచ్ చూపించింది.. దీంతో చీకట్లో లారీని నడుపుతూ అలాగే వెళ్లారు. వాన వల్ల నిలిచిన నీరు అనుకున్నారు. అలాగే ముందుకు వెళ్లగానే లోతు పెరిగిపోయింది. లారీ క్యాబిన్ వరకు నీళ్లు చేరింది. దీంతో వాహనం పనిచేయడం ఆగిందని గ్రహించిన వారిద్దరు కిందికి దిగి మెల్లగా సమీపంలోని రామవరం గ్రామానికి వెళ్లారు. విషయం గ్రామస్తులకు తెలుపగా లారీ ప్రాజెక్టు నీటిలోకి వెళ్లిందని గ్రహించిన వారు లారీకి తాళ్లు కట్టి వెనక్కి లాగేందుకు ప్రయత్నం చేశరు.

Read Also: Viral Video : ఓరి నాయనో..సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..

అతి కష్టం మీద లారీని బయటకు లాగారు. వాస్తవానికి నందారం స్టేజ్ దగ్గర రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుండి బైపాస్ రోడ్డు ద్వారా దారి మళ్ళించారు. అయితే స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి.. అది ఎవరు పట్టించుకోలేదు. దీంతో లారీ ఆ దారిలో వెళ్లి ప్రాజెక్టు నీటిలోకి దూసుకుపోయింది. ఇప్పటి కైనా నందారం నుంచి ఉన్న దారిని పూర్తిగా మూసివేయాలని గ్రామస్తులు, స్థానికులు కోరుతున్నారు.

Exit mobile version