NTV Telugu Site icon

Google Layoff: హై టాలెంటెడ్ ఉద్యోగులను కూడా వదలడం లేదు..

Google Layoff

Google Layoff

Google Layoff: గత ఏడాది కాలంగా టెక్ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. గత నవంబర్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ఇప్పటికే ఈ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. కొన్ని సంస్థలైతే దశాబ్ధాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా వదిలిపెట్టలేదు. ఇన్నేళ్లు పనిచేశారనే కనికరం కూడా లేకుండా ఉద్యోగం నుంచి తీసిపారేశాయి.

ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగించినట్లు సీఎన్బీసీ బుధవారం నివేదించింది. గూగుల్ తన వార్తా విభాగంలో చాలా మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ న్యూస్ లో 40 నుంచి 45 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే తమకు ఖచ్చితమైన సంఖ్య తెలియదని, ఇంకా వందలాది మంది న్యూస్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. మా సంస్థను క్రమబద్ధీకరించడానికి కొన్ని అంతర్గత మార్పులు చేస్తున్నామని, తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితమయ్యారని తెలిపారు.

Read Also: Putin: పుతిన్ ప్రసంగ సమయంలో యూరప్ ప్రతినిధుల వాకౌట్..

లేఆఫ్స్ గురించి గూగుల్ ఉద్యోగి లింక్డ్‌ఇన్ లో పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూగుల్ లో స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రాబ్.ఆర్ తన పోస్టులో కొందరు హై టాలెంటెడ్, అత్యుత్తమ వ్యక్తులను కూడా తొలగించారని వెల్లడించారు. ఈ నిర్ణయం వెనక ఉన్న లెక్కలు తనకు అర్థం కావడం లేదని.. వారు లేకుండా, మేము ఖచ్చితంగా అధ్వాన్నంగా ఉన్నామని ఆయన రాశారు.

ఇదిలా ఉంటే తాజా రౌండ్ లేఆఫ్స్ తమను ప్రభావితం చేయలేవని గూగుల్ పేర్కొంది. ఈ ఏడాదిల జనవరిలో గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఒక్క గూగుల్ మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, నోకియా వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.