NTV Telugu Site icon

Google : గూగుల్ లో సౌకర్యాలకు కోత..!

Sundar Pichai

Sundar Pichai

గూగుల్ కంపెనీలో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతెస్తారు.. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్ పార్లర్ లే కాదు.. తరుచుగా కంపెనీ లంచ్ లు కూడా ఉంటాయి.. అలాంటిది ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కంపెనీ కోత విధిస్తున్నాట్లు పేర్కొంది.

Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

గూగుల్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారీ ఉద్యోగాల కోత తర్వాత.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో దాని పనికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించే ఖర్చు తగ్గించే చర్యలను ప్రారంభించంది. PA మరియు ఫంక్షనల్ లీడ్స్ తరపున గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ ఈ ప్రకటన చేశారు. ఆర్థిక, సాంకేతికతంగా ముందుకు తీసుకెళ్లడానికి మా అద్భుతమైన పెట్టుబడి అవకాశాల కారణంగా ఈ పని చాలా ముఖ్యమైనదని తెలిపారు.

Also Read : MI vs RCB: ముంబైపై బెంగళూరు ఘనవిజయం.. దాదాపు ఓపెనర్లే కుమ్మేశారు

కొత్త హైబ్రిడ్ వర్క్‌వీక్‌కు ప్రతిస్పందనగా కంపెనీ తన కార్యాలయ సేవలలో మార్పులు చేయనున్నట్లు మెమో వెల్లడించింది. కేఫ్‌లు, మైక్రో-కిచెన్‌లు మరియు ఇతర సౌకర్యాలు ఎలా ఉపయోగించబడుతున్నాయి. ఎప్పుడు ఉపయోగించబడుతున్నాయి అనే దానితో మెరుగ్గా సరిపోయేలా రూపొందించబడతాయని డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోబడతాయని వెల్లడించార. ఒక కేఫ్ నిర్దిష్ట రోజులలో చాలా తక్కువ పరిమాణంలో వినియోగాన్ని చూసినట్లయితే, మేము దానిని ఆ రోజుల్లో మూసివేస్తాము మరియు దానికి బదులుగా సమీపంలో ఉన్న మరో దానిపై ఎక్కువ దృష్టి పెడతామని గూగుల్ తెలిపింది.

Also Read : Yuzvendra Chahal: చాహల్ తిప్పేశాడు.. సరికొత్త చరిత్ర సృష్టించాడు

గతంలో గూగుల్ లో 12,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఈ ఖర్చు తగ్గించే చర్యలను తీసుకున్నాట్లు చీఫ్ ఫైనాన్షియ్ ఆఫీసర్ పేర్కొన్నాడు. కంపెనీ తన ఉత్పత్తులు, వ్యక్తులు మరియు ప్రాధాన్యతలను సమీక్షించిందని, ఇది భౌగోళిక మరియు సాంకేతిక రంగాలలో ఉద్యోగాల కోతకు దారితీసిందని CEO సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. కంపెనీ ఎదుర్కొంటున్న భిన్నమైన ఆర్థిక వాస్తవికతను అతను గుర్తించాడు.. అందుకే ఆ స్థితికి దారితీసిన నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహించాను కానుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇటీవల గూగుల్ మాతృ సంస్థ Alphabet Inc.లోని ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ సమయంలో సహోద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ ఒక పిటిషన్‌పై సంతకం చేసింది. ఆల్ఫాబెట్ ఇంక్.లో పనిచేస్తున్న దాదాపు 1,400 మంది వ్యక్తులు సుందర్ పిచాయ్‌కి రాసిన బహిరంగ లేఖలో కొత్త నియామకాలను స్తంభింపజేయడంతోపాటు కొన్ని డిమాండ్‌లను జాబితా చేశారు.

Show comments