Google CEO: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 2021లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ కారణాల వల్ల ఒకేసారి 20 ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే అతను గూగుల్ ఉత్పత్తులు అన్నింటిలో బాగా పని చేస్తుందా లేదా అనేదాన్ని నిర్ధారించుకోవడానికి వివిధ ఫోన్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ లోకి కొత్తగా ఏ ఫోన్ వచ్చిన దాన్ని కొనుగోలు చేస్తాను అని తెలిపారు.
Read Also: Payal Rajput : పబ్ లోరెచ్చిపోయిన.. ప్రియుడి తల పగలగొట్టేసిందిగా.. వీడియో వైరల్..
ఇక, తన గూగుల్ ఖాతాలను ఎలా భద్రంగా ఉంచుకుంటాడో కూడా సుందర్ పిచాయ్ వివరించాడు. తన పాస్‌వర్డ్‌లను తరచుగా మార్చడం లేదన్నారు.. అలాగే, అదనపు భద్రత కోసం రెండు- కారకాల ప్రమాణీకరణపై ఆధారపడతానని అతను పేర్కొన్నారు. అయితే, మీరు తరచుగా పాస్‌వర్డ్‌లను మార్చినప్పుడు.. వాటిని గుర్తుంచుకోవడంలో తరచుగా సమస్య ఉంటుంది.. దాని కంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వినియోగించడం మరింత సురక్షితమైనది అని పిచాయ్ తెలిపాడు.
Read Also: Tata Ambani : చేతులు కలిపిన అంబానీ టాటా.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్‌లకు పోటీ
అయితే, టెక్ మీమ్ అనే వెబ్ సైట్ ను ఉదయమే ఓపెన్ చేస్తాను అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అందులో ఉన్న అప్ డేట్స్ ను క్రమం తప్పకుండా చదువుతాను అని తెలిపాడు. టెక్ రంగంపై ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇదొక మంచి వెబ్ సైట్ అన్నారు. అయితే, వెబ్ సెర్చ్ విధానం రోజు రోజుకూ మారిపోతోంది.. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని మరింతగా తీర్చిదిద్దాల్సి ఉందని ఆయన అన్నారు. దీనికోసం తాము జెమినీ అనే ఏఐ చాట్ బాట్ ను తీసుకొస్తున్నామని గూగుల్ సీఈఓ వెల్లడించారు. కాగా, ఈ వెబ్ సైట్ ను ఫాలో అయ్యే వారిలో మెటా ఫౌండర్ మార్క్ జుకెర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తదితర టెక్ దిగ్గజాలు కూడా ఉన్నారు.
