NTV Telugu Site icon

Akshaya Tritiya 2024: నేడు ‘అక్షయ తృతీయ’.. బంగారం కొనడానికి అనుకూల సమయం ఇదే!

Akshaya Tritiya 2024 Gold

Akshaya Tritiya 2024 Gold

Akshaya Tritiya 2024 Gold Buying Time: హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగల్లో ‘అక్షయ తృతీయ’ ఒకటి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు ఈ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది శుకవారం (మే 10) అక్షయ తృతీయ వచ్చింది. లక్ష్మీదేవత ప్రసన్నం కోసం.. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఇంటికి సంపదలు, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో నేడు బంగారం కొనడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం.

వైశాఖ మాసం శుక్లపక్షంలోని అక్షయ తృతీయ రోజు అబుజ్హ ముహూర్తంలో ఒకటిగా పరిగణించబడుతుంది. బంగారం, వెండి, వాహనాలు, ఆస్తులు.. కొనుగోలు చేయడానికి ఈ రోజు ఉత్తమంగా పరిగణించబడుతుంది. నేడు (అక్షయ తృతీయ) బంగారం కొనడానికి అనుకూలమైన సమయం ఉదయం 05:45 నుండి మొదలైంది. శనివారం (మే 11) ఉదయం 02:50 వరకు కొనుగోలు చేయొచ్చు.

Also Read: Satya Dev: ఆ తెలుగు క్రికెటర్‌ బయోపిక్‌లో నటించాలనుంది: సత్యదేవ్‌

ఇక నేడు పూజ సమయం ఉదయం 5:45 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు ఉంది. పూజ పీఠం, పసుపు వస్త్రం, 2 మట్టి కుండలు, కుంకుమ, బియ్యం, పసుపు, యాలకులు, గంగాజలం, చందనం, పసుపు, కుంకుమ, కర్పూరం, తమలపాకులు, లక్ష్మి-విష్ణువు ఫోటో, ధూపం, నాణేలు, పంచామృతం, పండ్లు, పువ్వులు, కొబ్బరి కాయలు, దీపం, అష్టగంధలతో పాటు ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీదేవికి సమర్పించండి. ఈ రోజున నువ్వులు, నెయ్యి, బట్టలు, ఉప్పు, తేనె, పండ్లు, బియ్యం, ధాన్యం మొదలైన వాటిని దానం కూడా చేయొచ్చు.