NTV Telugu Site icon

Shirdi Sai Temple: షిర్డీ సాయి భక్తులకు గొప్ప శుభవార్త.. ఇకపై బాబా సమాధిని నేరుగా తాకే అవకాశం

Shirdi Sai

Shirdi Sai

Shirdi Sai Temple: షిర్డీ సాయి భక్తులకు ఇది నిజంగా గొప్ప శుభవార్తే. ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సంస్థాన్‌ గొప్ప భాగ్యాన్ని కలిగించింది. షిర్డీ సాయి సమాధిని స్పృశించే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు వీఐపీ భక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పటి నుంచి సాధారణ భక్తులకు కూడా ఈ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు.

World Population: నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎంతంటే?..

ఒకప్పుడు సాయి సమాధిని తాకే అవకాశం అందరికీ ఉండేది. అయితే, భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ తర్వాత భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టారు. దీంతో అప్పటి నుంచి సాయి సమాధిని స్పృశించే అవకాశం సాధారణ భక్తులకు లేకుండా పోయింది. కేవలం వీఐపీ భక్తులకు మాత్రమే అవకాశం కల్పించారు. తాజాగా, మరోమారు ఆ అవకాశాన్ని తీసుకురావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయి సమాధిని స్పృశించే అవకాశం కల్పించడం వల్ల షిర్డీకి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.

Show comments