మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4-జీ సెల్‌టవర్స్‌ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్ధవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 4, కాకినాడలో ఒక ఏర్పాటు చేశారు.
YCP: భీమిలిలో ఎన్నికల శంఖారావం సభ.. తొలి క్యాడర్ మీటింగ్ చేపట్టనున్న సీఎం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. దాదాపు రూ.400 కోట్లు ఖర్చుతో టవర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు 300 టవర్లు, అంతకుముందు జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరంగా ఉండబోతోంది. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం కలగనుందని సీఎం పేర్కొన్నారు. కాగా.. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా రూ.3,119 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. టవర్ల నిర్మాణానికి అవసరమైన భూములను వెంటనే టెలికాం సంస్థలకు కేటాయించామని సీఎం తెలిపారు. వీటి ద్వారా 5,549 గ్రామాలకు పూర్తి స్థాయిలో మొబైల్ టెలికాం సేవలు అందుతాయన్నారు. ఇప్పటి వరకు సీగ్నల్ లేని అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయని సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు.
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో సంచలనం.. సీఎం నితీష్‌ని గద్దె దింపేందుకు లాలూ ప్లాన్.?
ఇన్నాళ్లు సెల్ ఫోన్లకు దూరంగా ఉన్నా.. సెల్ ఉన్నా సిగ్నల్ రాక ఇబ్బందిపడ్డ గిరిజనులకు ఇకపై సిగ్నల్స్ ఫ్రీగా వచ్చేస్తాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా సెల్ సిగ్నల్స్ ట్రింగ్ ట్రింగ్ మంటాయన్నారు. దీంతో.. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయన్నారు. సెల్ టవర్లు అందుబాటులోకి రావడం వల్ల మారుమూల గిరిజన ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతాయని వెల్లడించారు. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు, ఇంగ్లిషు మీడియం స్కూల్స్ లో మెరుగైనా సిగ్నల్ వ్యవస్థ ఉంటుందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన టవర్లు ద్వారా గ్రామ రూపురేఖలు మారుతాయని వెల్లడించారు. ఆన్ లైన్ సేవలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయని సీఎం తెలిపారు.
