NTV Telugu Site icon

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..త్వరలో వెయిటింగ్ కష్టాలకు స్వస్తి!

Railway

Railway

పండుగల సమయంలో రైళ్లలో టిక్కెట్లు దొరకడమే పెద్ద సమస్యగా మారింది. కొన్ని వారాలకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా..నిరీక్షణ తప్పదు. అయితే రానున్న రెండేళ్లలో టిక్కెట్ల వెయిటింగ్ కష్టాలకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ ప్లాన్ చేసింది. ఇక ప్రయాణికులు కొన్ని రోజులు మందుగా టికెట్ బుక్ చేసుకున్నా.. సీట్ దొరికే అవకాశం రానుంది. ఎలా అనుకుంటున్నారా..? రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 మరియు 2025-26 సంవత్సరాల్లో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దాని నెట్‌వర్క్‌లో సామాన్యుల పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి.. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,485 నాన్-ఏసీ కోచ్‌లను, 2025-26లో మరో 5,444 కోచ్‌లను ప్రవేశపెడతామని మంత్రిత్వ శాఖ ఉత్పత్తిని పెంచే ప్రణాళికను వెల్లడిస్తూ ఓ సీనియర్ అధికారి తెలిపారు. అదనంగా.. రైల్వే తన రోలింగ్ స్టాక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికి 5,300 కంటే ఎక్కువ సాధారణ కోచ్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

READ MORE: Amoeba: చిన్న పిల్లల మెదడును తినే అమీబా లక్షణాలు ఇవే.. నివారణ పద్దతులు ఏంటంటే..?

ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక గురించి ఆయన మాట్లాడుతూ.. “భారతీయ రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,605 సాధారణ కోచ్‌లను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి రూపొందించిన ప్రత్యేక అమృత్ భారత్ జనరల్ కోచ్‌లు కూడా ఉన్నాయి. నాన్-ఎసీ స్లీపర్ కోచ్‌లు, ఎస్‌ఎల్‌ఆర్ (సిట్టింగ్-కమ్-లగేజ్ రేక్) కోచ్‌లు, అమృత్ భారత్ కోచ్‌లు, హై కెపాసిటీ పార్శిల్ వ్యాన్‌లు, ప్యాంట్రీ కోచ్ లు కూడా తయారు చేస్తారు. భారతీయ రైల్వే కూడా 2025-26లో 2,710 కొత్త జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసింది. అమృత్ భారత్ జనరల్ కోచ్‌లు అధునాతన ఫీచర్లతో ప్రారంభిస్తారు. ఇందులో 1,910 నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు, 514 సీటింగ్ కమ్ లగేజ్ ర్యాక్ కోచ్‌లను కూడా ప్రారంభించనున్నారు. నిరీక్షణ టిక్కెట్ల సమస్యకు ముగింపు పలకడమే రైల్వే లక్ష్యం. అందుకోసం వేలాది కొత్త కోచ్‌లను తయారు చేస్తున్నాం.” అని పేర్కొన్నారు.