Site icon NTV Telugu

UPSC Jobs 2024: ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్.. 404 పోస్టుల భర్తీ..

Jobbss

Jobbss

ఇంటర్ పాసైన నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్‌ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఖాళీలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి.. జూన్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆ తర్వాత 5 నుంచి 11 వరకు అప్లికేషన్ సవరణ అవకాశం కల్పించనున్నారు..

మొత్తం ఖాళీల సంఖ్య..

నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 370 పోస్టులు (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120)
నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 34

అర్హతలు..

ఆర్మీ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి..

వయోపరిమితి..
అభ్యర్థులు 02.01.2006 – 01.01.2009 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి..

దరఖాస్తు ఫీజు…

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వారు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి..

ఎంపిక విధానం..

అభ్యర్థులకు రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవాలి.. జూన్ 4 ఆఖరి తేదీ…

Exit mobile version