NTV Telugu Site icon

NTR: యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త?

Ntr

Ntr

NTR: టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. సందర్భాలతో సంబంధం లేకుండా ఎక్కువ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. పాత చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను చూపుతూ కొత్త సినిమాల కంటే కూడా కొన్ని సినిమాలు వసూళ్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్ సూపర్‌హిట్ చిత్రం అదుర్స్‌ని మార్చి నెలలో మళ్లీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్లాన్‌లు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో తారక్ ద్విపాత్రాభినయం చేశారు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ కామెడీ ట్రాక్‌కి ప్రత్యేక అభిమానుల సంఖ్య ఉంది. ఈ దృశ్యాలు తరచుగా సోషల్ మీడియాలో మీమ్స్ కోసం ఉపయోగించబడతాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నయనతార, షీలా కథానాయికలుగా నటించారు.

Prabhas: ఆదిపురుష్ కి కొత్త కష్టం… ఓవర్సీస్ లో కష్టమే

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్న స్టార్‌ హీరోల చిత్రాలను ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయా హీరోల స్పెషల్‌ డేస్‌ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవర్‌గ్రీన్‌ చిత్రాలను మళ్లీ రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ చేత ఈళలు వేయిస్తున్నారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పోకిరి, పవన్‌ కల్యాణ్‌ జాల్సా, రీసెంట్‌గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్‌ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చాయి. కలెక్షన్స్‌ పరంగా పోకిరి, జాల్సా చిత్రాలు అదుర్స్‌ అనిపించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం అదుర్స్ కూడా రాబోతోందని సమాచారం. ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.