పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ రమణారావుపై ఈడీ, ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. విదేశీ అకౌంట్లు, పలు కంపెనీల్లో పెట్టుబడులపై ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనన్నారు. ఐదు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి హోంశాఖతో పాటు ఈడీకి ఫిర్యాదు చేస్తానని, దేశంలోనే పేరున్న ఆడిటర్ తో విదేశీ ఖాతాలు, పెట్టుబడులపై ఆరా తీస్తామన్నారు. 2018లో 2023లో వేర్వేరు పాన్ కార్డు నెంబర్లు ఎందుకు ఇచ్చారని, సూట్ కేస్ కంపెనీల్లో పెట్టుబడులపై సంబంధిత అధికారులు విచారణ చేసి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు గోనె ప్రకాష్ రావు. విజయ రమణారావు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని, విదేశీ ఖాతాలపై ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈడీ రాకముందే పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Gone Prakash Rao : విజయ రమణారావు బహిరంగ చర్చకు సిద్ధం కావాలి

Gone Prakash Roa