బంగారం ధరలు వరుసగా రెండో రోజు షాకిచ్చాయి. నిన్న తులం గోల్డ్ పై రూ. 2700 పెరిగిన విషయం తెలిసిందే. నేడు మళ్లీ పసిడి ధరలు మరింత పైకి ఎగబాకాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 500 పెరిగింది. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ. 3100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,900, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,075 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:HYDRA: ఉలిక్కపడ్డ పాతబస్తీ.. చంద్రయాణగుట్ట హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరగడంతో రూ. 90,750 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 పెరగడంతో రూ. 99,000 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,150 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Sriram : ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి..
బంగారం ధరలతో పాటు సిల్వర్ ధరలు కూడా పరుగులు పెట్టాయి. కిలో వెండి ధర రూ.3100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,11,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2100 పెరిగింది. రూ. 99,000 వద్ద అమ్ముడవుతోంది.
