NTV Telugu Site icon

Gold Found: ఓర్ని.. ‘అక్కడ’ అంత బంగారం ఎలా పెట్టావురా బాబు.. నీ తెలివితగలయ్యా!

Gold

Gold

Gold Worth Rs 70 Lakh Found In Man’s Rectum At Trichy Airport: ఇటీవల బంగారం స్మగ్లింగ్ చేస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు. బంగారం స్మగ్లింగ్ చేసే సమయంలో వారి తెలివితేటలు చూసి అధికారులు షాక్‌ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పురీషనాళంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు చిక్కాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి రూ.70.58 లక్షల విలువైన మొత్తం 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్యాకెట్లలో 1081 గ్రాముల పేస్ట్‌తో కూడిన మెటీరియల్‌ను ప్రయాణికుడి పురీషనాళంలో దాచినట్లు అధికారులు తెలిపారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో దుబాయ్‌ నుంచి తిరుచ్చికి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. స్మగ్లర్ల చావు తెలివితేటలు చూసి అధికారులు షాక్‌కు గురవుతున్నారు.

Read Also: Mumbai: ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్.. కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

అంతకుముందు, ఈ మార్చిలో, తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు సింగపూర్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి రూ. 26.62 లక్షల విలువైన 410 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సింగపూర్ నుంచి తిరుచ్చి వెళ్తున్న ఓ ప్రయాణికుడి చొక్కాలో దాచిపెట్టిన 330 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 330 గ్రాములు, పేస్ట్ లాంటి పదార్థంతో తీసిన 80 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఉన్నాయి.