Gold Price Today in Hyderabad on 24th September 2023: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ పెరిగాయి. వరుసగా రెండు రోజులు పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. శుక్ర, శని వారాల్లో కలిపి తులం బంగారంపై రూ. 380 వరకు తగ్గగా.. ఆదివారం రూ. 110 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 60 వేలకు చేరువ అయింది. దాంతో బంగారం అంటేనే చాలా మంది జంకుతున్నారు. ఎప్పుడెప్పుడూ తగ్గుతుందా? అని మళ్లీ ఎదురుచూడక తప్పడం లేదు.
బులియన్ మార్కెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,100గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,210లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,230 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది.
Also Read: Viral Video : పాటతో షారుఖ్ ను మెప్పించిన చిన్నారి.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
మరోవైపు వెండి ధర నేడు పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఆదివారం రూ. 75,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,800గా ఉండగా.. చెన్నైలో రూ. 79,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,250 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 79,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,300ల వద్ద కొనసాగుతోంది.