Site icon NTV Telugu

Gold Rate Today: అయ్యబాబోయ్.. బెంబేలేత్తిస్తున్న బంగారం ధరలు! కొనడం కష్టమే ఇగ

Gold Pricee

Gold Pricee

Gold Rate Hikes Today in India on 22 July 2025: గత వారం రోజులుగా గోల్డ్ రేట్స్ నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైం హైకి చేరాయి. స్వచ్ఛమైన తులం పసిడి లక్ష మార్క్ దాటి దూసుకెళుతోంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరగగా.. ఈరోజు ఏకంగా రూ.1050 పెరిగింది. అలానే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110 పెరగగా.. ఈరోజు రూ.1140 పెరిగింది.

బులియన్ మార్కెట్‌లో (జులై 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,850గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,290గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,850గా.. 24 క్యారెట్ల ధర రూ.1,01,290గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.93,000గా.. 24 క్యారెట్ల ధర రూ.1,01,440గా నమోదైంది. బంగారం పరుగులు పెడుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ కొనడం కష్టమే అని సామాన్య జనాలు అంటున్నారు.

Also Read: TTD Employees: టీటీడీలో బైబిల్స్ పంపిణీ.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!

మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర నేడు భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండిపై రూ.2000 పెరిగి.. రూ.1,18,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,28,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ.1,18,000గా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

Exit mobile version