NTV Telugu Site icon

Gold Price Today మగువలకు భారీ షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు!

Gold Price

Gold Price

Gold Prices Raise for the second day in a row: బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. గత వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం (మే 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.220 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,930 వద్ద కొనసాగుతోంది.

నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,930గా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,080గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది.

Also Read: Gambhir-SRK: బ్లాంక్‌ చెక్‌ ఆఫర్‌.. మన్నత్‌లో షారుక్‌తో గంభీర్‌ పలుమార్లు భేటీ!

మరోవైపు నేడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా రూ.3,500 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా ఉంది. మంగళవారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,500 కాగా.. ముంబైలో రూ.96,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,01,000లుగా నమోదవగా.. అత్యల్పంగా బెంగళూరులో రూ.93,250గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం) కిలో వెండి ధర రూ.1,01,000లుగా నమోదైంది.