ప్రతిరోజూ జనాలు మాట్లాడుకునే ప్రధాన అంశాలలో ‘బంగారం’ ఒకటి. గత కొన్ని నెలలుగా గోల్డ్ రేట్స్ పెరగడమే ఇందుకు కారణం. ప్రతిరోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేటి పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడిపై రూ.120 పెరగగా.. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.110 పెరిగింది.
బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.1,22,680గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1,200 పెరిగింది. ఆభరణాల తయారీకి ప్రాచుర్యం పొందిన 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,450గా నమోదైంది. నిన్నటి కంటే రూ.1,100 ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,22,680గా.. 22 క్యారెట్ల ధర రూ.1,12,450గా ట్రేడ్ అవుతోంది.
Also Read: CWC 2025 Prize Money: 297 శాతం పెంపు.. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఊహించని ప్రైజ్‌మనీ!
మరోవైపు వెండి ధర మాత్రం నేడు స్థిరంగా ఉంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,51,000గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,65,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,51,000గా ట్రేడ్ అవుతోంది. ఈ బంగారం, వెండి ధరలు ప్రాంతాల వారీగా ఉంటాయన్న విషయం గుర్తించుకోవాలి. జీఎస్‌టీ అదనంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.
