Gold and Silver Rate Today in Hyderabad: ఇటీవలి రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళల్లో పెరిగి.. వందల్లో మాత్రమే తగ్గడంతో పసిడి ధరలు దిగిరావడం లేదు. ఆ మధ్య వరుసగా పెరుగుతూ లక్ష 30 వేలు దాటిన గోల్డ్.. వరుసగా తగ్గుతూ లక్ష 22 వేలకు చేరింది. హమ్మయ్య.. బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించే లోపే మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండు రోజులు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం.
బుధవారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.33 తగ్గి.. రూ.12,551 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.30 తగ్గి.. 11,505గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,510గా.. 22 క్యారెట్ల ధర రూ.1,15,050గా నమోదయింది. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.330 తగ్గి రూ.1,25,510 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాములపై రూ.300 తగ్గి రూ.1,15,050 పలుకుతోంది. విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: AQI: అత్యంత ప్రమాదకర స్థాయి.. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఆన్ లైన్ తరగతులు!
వెండి ధరలు తగ్గేదెలా అనేలా దూసుకెళుతున్నాయి. ఇటీవల స్థిరంగా ఉన్న వెండి.. గత మూడు రోజులుగా భారీగా పెరిగింది. కిలో వెండిపై మొన్న రూ.4500, నిన్న రూ.3000 పెరగగా.. ఈ రోజు రూ.2000 పెరిగింది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,62,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,73,000గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
