Site icon NTV Telugu

Gold Rate Today: వరుసగా ఐదవరోజు బాదుడే.. లక్ష 20 వేలకు చేరువగా బంగారం ధర!

Gold Price Today

Gold Price Today

2025 దసరా, దీపావళి పండుగ సీజన్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా ఐదవ రోజు గోల్డ్ రేట్స్ పెరిగాయి. సెప్టెంబర్ 26 నుంచి వరుసగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరగగా.. 22 క్యారెట్లపై రూ.1,100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 1) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,18,640గా.. 22 క్యారెట్ల ధర రూ.1,08,750గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read: Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 తుది గడువు!

వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఇవాళ కాస్త బ్రేక్ ఇచ్చింది. గత 10 రోజుల్లో 16 వేలు పెరిగిన వెండి రేటు నేడు స్థిరంగా ఉంది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,51,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి లక్ష 60 వేలుగా ఉంది. పండుగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో సామాన్యులపై పెను భారం పడుతోంది. పెరిగిన ధరలతో బంగారం కొనాలంటే భయపడుతున్నారు.

Exit mobile version