NTV Telugu Site icon

Gold Today Price: బంగారం ప్రియులకు పండగ లాంటి వార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్! వెండి ధరలు కూడా

Gold Rate Women

Gold Rate Women

Gold Today Rate on 10th August 2023 in India and Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది.

Also Read: Bhola Shankar: “భోళా శంకర్” నిర్మాతల వివాదంపై కోర్టులో వాదనలు.. రేపు తీర్పు?

మరోవైపు వెండి ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 73,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,500గా ఉండగా.. చెన్నైలో రూ. 76,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,700ల వద్ద కొనసాగుతోంది.

 

Show comments