బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. బులియన్ మార్కెట్‌లో ఈ ఒక్క రోజే గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.3,280 పెరిగింది. దాంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,680గా నమోదైంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3000 పెరగగా.. రూ.1,17,950గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
గత 10 రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పది రోజుల్లో వెయ్యికి పైగా నాలుగు సార్లు గోల్డ్ రేట్స్ పెరిగాయి. ఈరోజు అయితే ఏకంగా మూడు వేలకు పైగా పెరిగింది. దాంతో పసిడి ప్రియులు షాక్ అవుతున్నారు. ఇక బంగారం కొనలేం అని సామాన్య జనాలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే గోల్డ్ షాప్స్ కళ తప్పాయి. వచ్చే నెల రోజుల్లో లక్షన్నర అవుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా షాక్ ఇస్తున్నాయి. బంగారంకు తానేమీ తక్కువ కాదన్నట్లు రోజురోజుకు దూసుకెళుతోంది. ఈ వారం రోజుల్లో వరుసగా 3, 7, 7, 6, 0, 5, 4 వేలు పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.4000 పెరిగి.. 1,89,000గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో అయితే రూ.2,06,000గా ఉంది. మొన్నటి వరకు వెండి అయినా కొందామనుకున్న వారు కూడా ఇప్పుడు వెనకంజ వేస్తున్నారు. ఇకపై బంగారం, వెండి కొనడం సామాన్యులకు ఓ కలగా మారే అవకాశం ఉంది.
