గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి పండగతో పాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో.. గత రెండు వారాలుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాలకు ధరలు చేరుకున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉండి నిన్న ధరలు తగ్గాయని పసిడి ప్రియులు సంతోషించేలోపే మరలా గోల్డ్ షాక్ ఇచ్చింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,650గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,350గా ఉంది.
మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. నిన్న తగ్గింది. నేడు మరలా స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి ధర రూ.96,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేలుగా నమోదైంది. ఇటీవలి రోజుల్లో లక్ష పన్నెండు వేలకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అత్యల్పంగా బెంగళూరు, ముంబైలలో 96 వేలుగా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,650
విజయవాడ – రూ.73,650
ఢిల్లీ – రూ.73,800
చెన్నై – రూ.73,650
బెంగళూరు – రూ.73,650
ముంబై – రూ.73,650
కోల్‌కతా – రూ.73,650
కేరళ – రూ.73,650
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,350
విజయవాడ – రూ.80,350
ఢిల్లీ – రూ.80,500
చెన్నై – రూ.80,350
బెంగళూరు – రూ.80,350
ముంబై – రూ.80,350
కోల్‌కతా – రూ.80,350
కేరళ – రూ.80,350
Also Read: IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలోకి 42 ఏళ్ల స్టార్ పేసర్.. 2014లో చివరగా టీ20 మ్యాచ్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,05,000
విజయవాడ – రూ.1,05,000
ఢిల్లీ – రూ.96,000
ముంబై – రూ.96,000
చెన్నై – రూ.1,05,000
కోల్‌కతా – రూ.96,000
బెంగళూరు – రూ.96,000
కేరళ – రూ.1,05,000