2025 దసరా, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పండుగ వేళ పసిడి ధరలు భారీగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు వేలల్లో పెరుగుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిగా పైగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1410 పెరగగా.. ఈరోజు రూ.1420 పెరిగింది. అలానే 22 క్యారెట్లపై రూ.1300, రూ.1300 పెరిగింది. దీంతో పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేస్తోంది.
బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,450గా.. 24 క్యారెట్ల ధర రూ.1,18,310గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో ఇవే ధరలు కొనాగుతున్నాయి. తులం 50 వేలు ఉన్నప్పుడు ఎక్కువ ధర అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా లక్ష 20 వేలకు చేరువైంది. ఇంకొన్నిరోజులు గడిస్తే సామాన్య జనాలు బంగారం గురించి మర్చిపోవాలేమో అని అనిపిస్తోంది. బంగారం పెరుగుల ఇలానే ఉంటుందని ఇటీవల నిపుణులు చెప్పారు. మరికొన్ని నెలల్లో రెండు లక్షల రూపాయలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: Trump Tariffs: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. మళ్లీ ఏశాడుగా!
బంగారంతో పాటు వెండి ధర కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో ఏకంగా 16 వేలు పెరిగింది. ఈ రెండు రోజుల్లో వరుసగా వెయ్యి పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,51,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కిలో వెండి ఒక లక్ష 61 వేలుగా నమోదైంది. ధంతేరాస్, దీపావళి సీజన్‌లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పండుగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు ఇంతలా పెరిగిపోతుండటం సామాన్యులను కలవరపరుస్తోంది. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రూపాయి విలువ, ఫెడ్ వడ్డీ రేట్లు, సెంట్రల్ బ్యాంకు బంగారం రిజర్వులు.. పలు కారణాల వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ప్రభావితం అవుతాయన్న విషయం తెలిసిందే.
