Site icon NTV Telugu

Gold Rate Today: ఆగని పసిడి పరుగు.. కొనాలంటే కష్టమే! నేటి గోల్డ్ రేట్స్ ఇలా

Gold Rate Hyderabad

Gold Rate Hyderabad

Gold and Silver Prices on 6th August 2025: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. అయినా కూడా పసిడి పరుగు ఆగనంటోంది. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,800గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,330గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,950గా.. 24 క్యారెట్ల ధర రూ.1,02,480గా ట్రేడ్ అవుతోంది. ఈ నాలుగు రోజుల్లో బంగారం రేట్లు దాదాపుగా రూ.2500 పెరిగింది. రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి సామాన్యులకు భారంగా మారింది. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు పెరగడంతో కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై నెలలో కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపించిన పసిడి ధరలు.. ఈ నెలలో భారీ షాక్స్ ఇస్తున్నాయి.

Also Read: Betting App Case: నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ.. ఏం చెబుతాడో అని సర్వత్రా ఆసక్తి!

మరోవైపు వెండి ధర కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగింది. నిన్న కిలో వెండిపై రెండు వేలు పెరగగా.. ఈరోజు వెయ్యి పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి రూ.1,16,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 26 వేలుగా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ఒక లక్ష 16 వేలుగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి రేట్స్ ఇవి. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

Exit mobile version