NTV Telugu Site icon

Gold Price : మరో సారి షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?

Gold

Gold

Gold Price : 2025 సంవత్సరం ప్రారంభం అయిన దగ్గర నుంచి బంగారం ధరలు కొత్త రికార్డులను నెలకొల్పుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు గ్యాప్ ఇవ్వకుండా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న తులానికి 380 పెరిగిన బంగారం మరో సారి భారీగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధర రూ.380 లు పెరిగి 87వేల 050లకు చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400లు పెరిగి 79వేల 800 లకు చేరింది.

Read Also:Infinix Hot 50 5G: కేవలం రూ.10000కే అద్భుతమైన ఫీచర్లతో మొబైల్..

నేడు హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 110 రూ. 87వేల160లు, 22 క్యారెట్ల తులం బంగారం ధర 100పెరిగి రూ. 79వేల 900లుగా ఉంది. మరో వైపు హైదరాబాద్ లో వెండికి కూడా డిమాండ్ పెరిగింది. కొనుగోలు ఎక్కువగా ఉండటంతో కిలో వెండి ధర రూ. లక్షా 07వేలుగా ఉంది.

Read Also: Pawan Kalyan : “వీరమల్లు” నుంచి ఆ విషయంలో క్లారిటీ వచ్చేది ఈ రోజే

బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ,కేంద్రం విధించే దిగుమతి సుంకాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.